న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: అంతరిక్షంలో మరో అద్భుతం సాక్షాత్కారమైంది. భూమికి ప్రస్తుతమున్న చంద్రుడికి తోడు మరో చిన్ని చంద్రుడు వచ్చి చేరాడు. నవంబర్ చివరి వరకు అంటే దాదాపు రెండు నెలల పాటు ఈ మినీ మూన్ భూమి చుట్టూ తిరగనున్నా డు.
సూర్యుడి చుట్టూ పరిభ్రమించే 2024 పీటీ అనే గ్రహశకలం భూమి గురుత్వాకర్షణ పరిధిలోకి రావడంతో అది మినీ మూన్‌గా మారిందని, నవంబర్ తర్వాత ఈ చిన్ని చందమామ మళ్లీ తన పాత కక్షలో ప్రయాణించనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే చాలా గ్రహశకలాలలు తరచుగా భూమికి దగ్గరగా ఉంటాయని, అందులో 1981లో గ్రహశకలం 2022 ఎన్‌ఎక్స్1 మినీ మూన్‌గా మారిందని, 2051లో మళ్లీ అది తిరిగి రావచ్చని, అలాగే 2006ఆర్‌హెచ్120 అనే గ్రహశకలం జూలై 2006 నుంచి జూలై 2007 వరకు భూమి చుట్టూ తిరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు.