calender_icon.png 15 November, 2024 | 3:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో నేతన్న బలవన్మరణం

14-11-2024 12:21:04 AM

అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య

సిరిసిల్ల, నవంబర్ 13(విజయక్రాంతి): అప్పుల బాధ భరించలేక మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్లలో చోటుచేసుకున్నది. ఐదు రోజులు  క్రితం బైరి అమర్ దంపతులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం మరుకముందే సిరిసిల్ల పట్టణంలోని గణేశ్‌నగర్‌కు చెందిన  నేత కార్మికుడు ఎర్రం కొమురయ్య (56) బుధవారం ఇంట్లోని దూలానికి తాడుతో  ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. కొమురయ్య నేత కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

కుమారుడికి వివాహం చేసేందుకు కొమురయ్య నిశ్చయించుకోగా వారి ఇల్లు చిన్నగా ఉండడంతో పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముం దుకు రాలేదు. దీంతో కొమురయ్య రూ.10 లక్షల వరకు అప్పులు చేసి, ఇంటికి మరమ్మతులు చేయించాడు.  కొద్దిరోజులుగా చేతి నిండా పని లేకపోవడం, తీసుకు న్న అప్పులకు వడ్డీలు పెరగడంతోపాటు కొన్ని అనా రోగ్య  సమస్యలు  కొమురయ్యను వెంటాడాయి.

ఈక్రమంలో అప్పు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక బుధవారం ఇంట్లో ఎవరూ  లేని సమయంలో ఇంట్లోని దూలానికి తాడుతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొమురయ్యకు భార్య కమల, కుమారులు శ్రీకాంత్, సాయికిరణ్, కూతురు వరలక్ష్మి ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు  మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.