calender_icon.png 12 January, 2025 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చే ఏడాది మరో ఐపీఓ!

10-12-2024 12:00:00 AM

ముంబై: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ దేశీయంగా తొలి పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతోంది. రాబోయే 12-15 నెలల్లో ఈ ఐపీఓ ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. చిన్న స్టార్టప్ స్థాయి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఈకామర్స్ సంస్థగా ఎదిగిన ఫ్లిప్‌కార్ట్.. వచ్చే ఏడాది మరో బిగ్ ఐపీఓగా నిలవబోతోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశీయంగా ఐపీఓకు వచ్చేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలు పెట్టిందని పలు ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. ఇందులో భాగంగా తొలుత తన హోల్డింగ్ కంపెనీని సింగపూర్ నుంచి భారత్‌కు తరలించాలని ఫ్లిప్‌కార్ట్ భావిస్తోందని సమాచారం.

ఇందుకోసం అంతర్గతంగా ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. 2025లోనే ఐపీఓ ఉండొచ్చని, మరీ ఆలస్యమైతే 2026 తొలి త్రైమాసికంలో రావొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే జొమాటో, స్విగ్గీ, నైకా వంటి కొత్తతరం కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యాయి. వాటి సరసన ఫ్లిప్‌కార్ట్ కూడా చేరనుంది.ఐఐటీఢిల్లీ విద్యా ర్థులైన సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ 2007లో ఫ్లిప్‌కార్ట్ స్థాపించారు. దీన్ని 2018లో అమెరికాకు చెందిన వాల్‌మార్ట్ సంస్థ కొనుగోలు చేసింది. ఆ సంస్థకు 81 శాతం వాటా ఉంది.