న్యూయార్క్, డిసెంబర్ 23: అమె రికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గంలో మరో భారతీ యుడికి చోటు లభించింది. ఆర్టిఫీషి యెల్ ఇంటెలిజెన్స్ సీనియర్ వైట్ హౌస్ పాలసీ అడ్వైజర్‌గా ఇండి యన్ అమెరికన్ శ్రీరామ్ కృష్ణన్‌ను ట్రంప్ నియమించారు. ఈయన గతంలో మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, యాహూ, ఫేస్ బుక్, స్నాప్‌లో పని చేశారు. కాగా ఇప్పుడు వైట్ హౌస్ ఏఐ అండ్ క్రిప్టో జార్‌గా ఉన్న డేవిడ్ సాక్స్‌తో కలిసి పనిచేయనున్నారు.
ఏఐలో అమెరికా నాయకత్వానికి సన్నిహితంగా పనిచే యడం తనకు గర్వకారణంగా ఉందని కృష్ణన్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఈ అవకాశం కల్పించిన డొనాల్డ్ ట్రంప్‌కు ధన్యవా దాలు తెలిపారు.