ఎన్‌ఐహెచ్ డైరెక్టర్‌గా జై భట్టాచార్య?
వాషింగ్టన్, నవంబర్ 24: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన కార్యవర్గాన్ని నియమించే ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలో దేశ వైద్యరంగంలో సంస్కరణలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్‌ఐహెచ్) కొత్త డైరెక్టర్‌గా జై భట్టాచార్యను నియమించాలని ట్రంప్ భావిస్తున్నట్లు ‘వాషింగ్టన్ పోస్ట్’ ఓ కథనాన్ని ప్రచురించింది.
అయితే ఎన్‌ఐహెచ్ పోస్టు కోసం ముగ్గురు వ్యక్తులు ప్రయత్నిస్తున్నా భట్టాచార్య వైపే ట్రంప్ మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నది. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్‌లో అసోసియేట్‌గా జై పనిచేస్తూనే ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఓ సంస్థకు డైరెక్టర్‌గారూ పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఐహెచ్ దృష్టి సారించాలని జై చెబుతున్నారు.
సంస్థలో కొన్ని ఏండ్లుగా పాతుకుపోయిన వారిని తొలగించాలని కోరారు. ఈక్రమంలో ట్రంప్ నియమించిన కొత్త మంత్రి రాబర్ట్ కెన్నడీని గతవారం జై కలిసి ఎన్‌ఐహెచ్‌పై తన ఆలోచనలను తెలియజేశారు. జై వివరించిన అంశాలపై కెన్నడీ సానుకూ లంగా స్పందించినట్లు ఆ కథనంలో పేర్కొన్నది.