calender_icon.png 22 March, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుజురాబాద్‌ విద్యార్థిని లవని ప్రియకు మరో గౌరవం

22-03-2025 01:07:30 PM

హుజురాబాద్, విజయక్రాంతి: కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌ పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు నిమ్మటూరి సాయి కృష్ణ కుమార్తె లవని ప్రియ మరోసారి తన నృత్య నైపుణ్యంతో గర్వించదగిన గుర్తింపు పొందింది. నృత్య అకాడమీ టీచర్ శ్రీనిధి ఆధ్వర్యంలో 21వ తేదీ నాడు బాసర సరస్వతి కళ్యాణ మండపంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో అద్వితీయంగా అలరించిన ఆమెను, ప్రముఖ పీఠాధిపతి శ్రీ శ్రీశ్రీ మాధవ నంద సరస్వతీ స్వామి  చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు.

ప్రతిభకు తగిన ప్రోత్సాహంగా ప్రశంసా పత్రాన్ని లవని ప్రియకు అందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని స్వామి ఆశీర్వదించారు. ఆమె కృషికి కుటుంబ సభ్యులు, గురువులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేశారు.నృత్య ప్రపంచంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, లవని ప్రియ, తన సాధనను కొనసాగిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని మున్సిపల్ తాజా మాజీచైర్మన్ గందే రాధిక- శ్రీనివాస్ మున్సిపల్ తాజా మాజీవైస్ చైర్మన్ కొలిపాక నిర్మల - శ్రీనివాస్ సీనియర్ పత్రికేయుడు కటుకూరి మల్లారెడ్డి  ఆశాభావం వ్యక్తం చేశారు.