calender_icon.png 7 November, 2024 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్టోబర్‌లో మరో గ్రూప్-1

03-08-2024 04:18:36 AM

  1. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన డిఫ్యూటీ సీఎం
  2. చెప్పింది చేసి చూపించాం గత ప్రభుత్వ తప్పులను సరిచేశాం..  జాబ్ క్యాలెండర్‌లో తేదీలు
  3. నోటిఫికేషన్లలో ఖాళీలు: భట్టి

హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచి చెప్పినట్లుగానే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెం డర్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని ఆనాడు హామీ ఇచ్చామని గుర్తు చేశారు. హమీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తున్నామని తెలిపారు.

తెలంగాణలో ఉద్యోగార్ధులకు నోటిషికేషన్‌లో ఆలస్యం, వాయిదాలు, పరీక్షల రద్దు, ప్రశ్నా పత్రాల లీకులు, వేర్వేరు పరీక్షల తేదీలు ఒకటే అవ్వడం లాంటి వాటివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని.. పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే అభ్యర్థులకు ఈ సమస్యలు తీవ్ర నిరుత్సాహపరిచేవని భట్టి తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహణ సరిగ్గా లేనందున  రెండుసార్లు గ్రూప్ -1 పరీక్ష రద్దు అయ్యిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్య పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తక్షణ కార్యాచరణ చేపట్టి, నూతన చైర్మన్‌ను  నియమించి ప్రక్షాళన చేపట్టామన్నారు. 

పోటీ పరీక్షలను సరళీకృతం చేసేందుకు..

పరీక్షలను సరళీకృతం చేయడానికి యూపీఎస్సీ, కేరళ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌లను సంప్రదించి, సీనియర్ ఐఏఎస్‌ల ఆధ్వర్యంలో రెండు కమిటీలను ఏర్పా టుచేశామని తెలిపారు. వారి సూచనల ఆధారంగా ప్రభుత్వం గత గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేసి, కొత్తగా 60 ఖాళీలను జత చేసి మరో నోటిఫికేషన్ జారీ చేసి.. పరీక్షను సజావుగా జరిపి ఫలితాలను కూడా ప్రకటించడంతోపాటు మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు షెడ్యూల్ చేసినట్లు తెలిపారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ పరీక్షలను కూడా సజావుగా జరిపామని భట్టి అన్నారు. వివిధ శాఖల్లో 32,400 మంది యువతకు నియామక ఉత్తర్వులను జారీ చేయడంతోపాటు.. 13,500 పోస్టులకు అనుమతులు కూడా మంజూరు చేసినట్లు వెల్లడించారు.

11,062 ఖాళీలతో డీఎస్సీ నోటిఫికే షన్ కూడా ఇచ్చి వాటికి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వీటి తోపాటు 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల భర్తీకి, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 45 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. పరీక్షలకు పరీక్షలకు మధ్య తగినంత సమయంలేని కారణంగా అభ్యర్థుల కోరిక మేరకు ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ -౧ పరీక్షలను డిసెంబర్‌కు వాయిదా వేసినట్లు డిఫ్యూటీ సీఎం తెలిపారు. రాష్ర్టంలో అనేక రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు ప్రభు త్వ ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్నందున పరీక్షా తేదీల మధ్య తగినంత గడువు లేక ఉద్యోగార్థులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని.. వారి సమస్యల పరిష్కారానికి యూపీఎస్సీ తరహాలో ప్రిపరేషన్‌కు సమయం ఇచ్చేలా పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ వంటి సంస్థలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు.

రాష్ర్ట ప్రభుత్వం ద్వారా నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కొరకు ప్రభుత్వం 2024 వార్షిక జాబ్ క్యాలెండర్ రూపొందించి గురువారం నాటి కేబినెట్ భేటీలో ఆమోదించామన్నారు. ఈ అంశంపై పలువురు సభ్యులు జాబ్ క్యాలెండర్‌లో తేదీలు మాత్రమే ప్రకటించారని, ఖాళీల విషయంపై స్పష్టతనివ్వలేదని సందేహాన్ని లేవనెత్తగా.. జాబ్ క్యాలెండర్‌లో కేవలం తేదీలు మాత్రమే ప్రకటిస్తారని, ఖాళీలకు సంబంధించిన సమాచారం నోటిఫికేషన్‌లో విధిగా పొందుపరుస్తారని భట్టి సమాధానం ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకు వరమని ఆయన అభివర్ణించారు.

జాబ్ క్యాలెండర్ 2024-25

అక్టోబర్: టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ 1 పరీక్షలు (ఇప్పటికే నోటిఫికేషన్ జారీ) 

నవంబర్: గ్రూప్-3 పరీక్షలు (ఇప్పటికే నోటిఫికేషన్ జారీ)

సెప్టెంబర్: వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సింగ్ ఆఫీసర్స్ నియామకాల నోటిఫికేషన్, నవంబర్‌లో పరీక్షలు

డిసెంబర్: గ్రూప్ ఉద్యోగాలకు పరీక్షలు (ఇప్పటికే నోటిఫికేషన్ జారీ)

అక్టోబర్: ట్రాన్స్‌కో, డిస్కంలలోని వివిధ ఇంజినీరింగ్ ఉద్యోగాలకై నోటిఫికేషన్, 2025 జనవరిలో పరీక్షలు

అక్టోబర్: గెజిటెడ్ కేటగిరీ ఇంజినీరింగ్ సర్వీసులకై నోటిఫికేషన్, 2025 జనవరిలో పరీక్షలు

నవంబర్: టెట్ నోటిఫికేషన్ విడుదల, 2025 జనవరిలో పరీక్షలు

అక్టోబర్: గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల  2025 ఫిబ్రవరిలో ప్రిలిమినరీ పరీక్షలు 

2025 జనవరి: వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాలకై నోటిఫికేషన్ జారీ, ఏప్రిల్‌లో పరీక్షలు

2025 ఫిబ్రవరి: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, ఏప్రిల్‌లో పరీక్షలు

2025 ఫిబ్రవరి: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు  నోటిఫికేషన్, మే నెలలో పరీక్షలు

2025 ఏప్రిల్: టెట్ నోటిఫికేషన్, జూన్‌లో పరీక్షలు 

2025 జూలై: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు 

2025 ఏప్రిల్: ఎస్సై ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల,  ఆగస్టులో పరీక్షలు

2025 ఏప్రిల్: పోలీసు కానిస్టేబుల్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల, ఆగస్టులో పరీక్షలు

2025 మే: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులతో సహా  గ్రూప్ పోస్టులకు నోటిఫికేషన్, అక్టోబర్‌లో పరీక్షలు 

2025 జూన్: డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్, సెప్టెంబర్‌లో పరీక్షలు

2025 జూన్: రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ  లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్, సెప్టెంబర్‌లో పరీక్షలు

2025 జూలై: గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్, నవంబర్ నెలలో పరీక్షలు 

2025 జూలై: సింగరేణిలో వివిధ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్, నవంబర్‌లో పరీక్షలు