calender_icon.png 1 November, 2024 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణమాఫీ పేరిట మరో మోసం

19-07-2024 12:34:46 AM

లబ్ధిదారుల సంఖ్యను తగ్గించిన కాంగ్రెస్ ప్రభుత్వం

రైతుబంధు నిధుల దారి మళ్లింపు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): ప్రభుత్వం రుణమాఫీ పేరిట రైతులను మరోసారి మోసం చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతుబంధు కింద జూన్‌లో ఇవ్వాల్సిన నిధుల నుంచి రూ.7 వేల కో ట్లు దారి మళ్లింపు చేయడం సరికాదన్నారు. హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుంచి కొంత మొత్తం విదిల్చి, రుణమాఫీ చేస్తున్నట్టు రేవంత్‌రెడ్డి సర్కా ర్ ఫోజులు కొడుతుందని మండిపడ్డారు. 40 లక్షలకుపైగా రైతులు రూ.లక్ష వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందిని ఏవిధంగా ఎంపిక చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

2014, 2018లో కేసీఆర్ సర్కార్ రుణమాఫీ చేసిన దాని తో పోలిస్తే పావు వంతు మందికే మాఫీ చేస్తారా? అని ప్రశ్నించారు. 2018లో రూ.లక్షలోపు రుణమాఫీకీ రూ.19,198 కోట్లు అంచనా కాగా మొత్తం  లబ్ధిదారుల సంఖ్య సుమారు 37 లక్షల వరకు ఉందన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులందరికీ రైతుబంధు విడుదల చేయాలన్నారు.