16-02-2025 12:39:50 AM
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులతో కూడిన ఆర్మీ విమానం సీతూ శనివారం అమృత్‌సర్ విమానాశ్రయానికి బయలుదేరింది. డొనాల్డ్ ట్రంప్ రెండో సారి అధ్యక్షుడిగా చార్జ్ తీసుకున్న తర్వాత అక్రమంగా ఉంటు న్న వారిపై కొరడా ఝలిపిస్తున్నారు. ఇప్పటికే 104 మందితో కూడిన ఆర్మీ విమానం భారత్‌కు రాగా.. ఇది రెండో విమానం.
ఈ విమానంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నారు. గుజరాత్, యూపీ, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఇందులో ఉన్నారు. ఆదివారం 157 మంది అక్రమవలసదారులను తీసుకుని మరో ఆర్మీ విమానం కూడా భారత్‌కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి.
ఈ విమానంలో కూడా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఫిబ్రవరి 5న భారత్‌కు చెందిన 104 మంది అక్రమ వలసదారులను అమెరికా ఆర్మీ విమానం అమృ త్‌సర్‌కు తీసుకొచ్చింది.
ప్రస్తుతం అమెరికా నుంచి తిరుగుపయనం అవుతున్న వలసదారుల్లో సరిహద్దుల్లో సైన్యానికి పట్టుబడిన వారే అధికం. వీరు లక్షల రూపాయలు ఖ ర్చు చేసి అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించడం గమనార్హం. అక్రమ మార్గా ల్లో “డాం కీ” రూట్ చాలా మందికి తెలిసిన పదం.
దద్దరిల్లిన పార్లమెంట్
అక్రమవలసదారులతో మొదటి విమా నం అమృత్‌సర్‌కు చేరుకున్న సమయంలో అందులో ఉన్న భారతీయుల కాళ్లకు చెయి న్లు, చేతులకు సంకెళ్లు వేసి.. అమెరికా అధికారులు అవమానించారని ఉభయసభల్లో ప్రతిపక్ష పార్టీలు ఫైర్ అయ్యాయి.
విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఈ విషయంపై పార్లమెంట్ సభ్యులకు వివరణ ఇచ్చారు. భారతీ యుల పట్ల అమెరికా అధికారులు దురుసుగా ప్రవర్తించకుండా ఉండాలని అమెరికా అధికారులను కోరతామన్నారు. అయినా కానీ ఈ వివాదం చల్లారలేదు.. సభలో వా యిదాలు, నిరసనలు చోటు చేసుకున్నాయి.
పంజాబ్‌లోనే ఎందుకు..
అక్రమ వలసదారులతో అమెరికా నుంచి వస్తున్న విమానాలను పంజాబ్‌లోనే ల్యాండ్ చేయడంపై పంజాబ్ ప్రభుత్వం మండిపడుతోంది. బీజేపీ ప్రభుత్వం కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తోందంటూ విమర్శలు గుప్పిస్తోంది.
మాటల యుద్ధం..
విమానాల ల్యాండింగ్ విషయంలో ఇటు బీజేపీ అటు ఆప్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ‘అక్రమవలసదారులతో వచ్చే విమానాలను అమృత్‌సర్‌లోనే ఎందుకు దించుతున్నారు. పంజాబ్ ప్రభు త్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ ఇలా చేస్తోంది. హర్యానా వాళ్లు కూడా ఉన్నారుగా.. హర్యానాలో దించితే ఏమవుతుంది’ అని పంజాబ్ సీఎం, ఆప్ నేత భగవంత్ మాన్ ప్రశ్నించారు.
అయితే మాన్ వ్యాఖ్యలను బీజేపీ తప్పుబట్టింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ మాట్లాడుతూ.. ‘యూఎస్ నుంచి వచ్చే విమానాలకు అమృత్‌సర్ దగ్గర కాబట్టే దాన్ని ఎంచుకున్నారు.
ఈ సున్నిత అంశాలను రాజకీయం చేయొ ద్దు. సీఎం తన స్థాయికి తగిన విధంగా వ్యవహరించాలి’. అని అన్నారు. పంజాబ్ కాం గ్రెస్ సీనియర్ లీడర్ ప్రతాప్ సింగ్ భజ్వా మాట్లాడుతూ.. మాన్ ప్రభుత్వంపై పలు విమర్శలు సంధించారు. గత మూడేళ్లుగా మీరు ఫెయిల్ అవుతూనే ఉన్నారంటూ ఆరోపించారు.