* అధికారుల అప్రమత్తతతో తప్పిన ప్రాణనష్టం
* ప్రయాగ్‌రాజ్‌కు కొనసాగుతున్న భక్తుల రద్దీ
* పుణ్యస్నానాలు ఆచరించిన 30కోట్ల మంది భక్తులు!
లక్నో, జనవరి 30: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో జరుగుతున్న మహా కుంభమేళాలో మంగళవారం అర్ధరాత్రి తొక్కిసలాట సంభవించి, 30 మంది భక్తులు మృత్యువాత పడగా, సుమా రు 60 మంది గాయాల పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువకముందే గురు వారం మరో అపశ్రుతి చోటు చేసుకుంది.
ప్రయాగ్‌రాజ్ సెక్టార్ ఛట్‌నాగ్ ఘాట్ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. మొదట ఒక గుడారంలో చేలరేగిన మంట లు, క్రమంగా పక్కనే ఉన్న 15 గుడారాలకు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అగ్నిప్రమాదంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
కాగా మేళా ప్రారంభమైన తర్వాత అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం ఇది రెండో సారి. ఇదిలా ఉంటే మహాకుంభమేళాకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం 10 గంటల వరకు దాదాపు 90లక్షల మంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య దాదాపు 30కోట్లకు చేరుకుంది.
వెలుగులోకి మరో తొక్కిసలాట
మహాకుంభమేళాలో బుధవారం రెండు చోట్లు తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తుంది. మొదటి తొక్కిసలాట అర్ధరాత్రి 1: 30 గంటలకు చోటుచేసుకోగా రెండో తొక్కిసలాట త్రివేణీ సంగమానికి 2 కి.మీ దూరంలో ఉన్న ఝాసీ ప్రాంతంలో తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో జరిగింది. ఈ విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. అయితే రెండోసారి జరిగిన తొక్కిసలాటలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారికవర్గాలు వెల్లడించాయి.
వీవీఐపీ పాస్‌లు రద్దు..
తొక్కిసలాట ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ అక్కడి యంత్రాంగంతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అవాంఛిత సంఘటలను నివారించేందుకు వీవీఐపీ పాస్‌లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చే వాహనాలను ప్రయాగ్‌రాజ్‌లోకి అనుమతించొద్దని ఆదేశించారు.
భక్త సమూహాలు ఎక్కువగా ఉన్నచోట, అందుకు అనుగుణంగా తాగునీరు, ఆహార వసతి ఏర్పాటు చేయాలని సూచించారు. ఫిబ్రవరి 3వ తేదీన ‘వసంత పంచమి’ సందర్భంగా అమృత స్నాన్ వేడుకలకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు.
కుంభమేళాలో టీటీడీ ఉద్యోగి అదృశ్యం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) ఉద్యో గి ఒకరు అదృశ్యమయ్యారు. టీటీడీ ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో విధు లు నిర్వహించేందుకు వెళ్లిన దీవేటి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు.
ఆయన ఆచూకీ కోసం స్థానిక పోలీసులు, టీటీడీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యోగి అదృశ్యంపై పూర్తి సమాచారం అందించాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారు లను ఆదేశించారు. శ్రీవారి నమూనా ఆలయంలో పనిచేసేందుకు సుమారు 200 మంది టీటీడీ ఉద్యోగులు వెళ్లారు. ఈక్రమంలో ఉద్యోగి సుబ్రహ్మణ్యం అదృశ్యమయ్యారు.