ముంబయి: దేశీయంగా మరో ఎలక్ట్రిక్ వాహన సంస్థ పబ్లిక్ ఇష్యూకు రాబోతోంది. హీరో మోటోకార్ప్ మద్దతు కలిగిన ఎలక్ట్రిక్ టూవీలర్ సంస్థ ఏథర్ ఎనర్జీ ఐపీఓకు సిద్ధమైంది.ఈ మేరకు సెబీకి ఐపీఓ పత్రాలను సోమవారం సమర్పించింది. ఐపీఓలో భాగంగా రూ.3,100 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు ప్రమోటర్లు 2.2 ఈక్విటీ షేర్లను విక్రయించను న్నారు. ఆఫర్ ఫర్ సేల్‌లో భాగంగా ప్రమోటర్లయిన తరుణ్ సంజయ్ మెహతా, స్వప్నిల్ బబన్‌లాల్ జైన్ 10 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు.
ప్రమోటర్లతో పాటు కలాడియం ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్, నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 2, 2 స్టేట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐఐటీఎం ఇంక్యుబేషన్ సెల్ అండ్ ఐఐటీఎంఎస్ రూరల్ టెక్నాలజీ అండ్ బిజినెస్ ఇంక్యుబేటర్ సంస్థ లూ వాటాలను విక్రయిస్తున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు వచ్చిన కొన్ని రోజులకే ఏథర్ కూడా ఐపీఓకు సిద్ధమవ్వడం గమనార్హం. ఇటీవల ఆ సంస్థ రూ.6415 కోట్లు మార్కెట్ నుంచి సమీకరించిన సంగతి తెలిసిందే. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను మూలధన వ్యయా లకు, మహరాష్ట్రలో కొత్త తయారీ కేంద్రం ఏర్పాటుకు, ఆర్‌అండ్‌డీకి వెచ్చించనున్నారు. యాక్సిస్ క్యాపిటల్, జేఎం ఫైనాన్షి యల్ బుక్ రన్నింగ్ మేనేజర్లుగా వ్యవ హరించనున్నాయి.