calender_icon.png 24 September, 2024 | 2:52 AM

భారత్‌లో మరో ఎంపాక్స్ కేసు

24-09-2024 12:58:58 AM

  1. క్లేడ్ 1బీ కేసుగా తేల్చిన వైద్యులు
  2. కంగారుపడుతున్న ప్రజలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎంపాక్స్ భారత్‌లో తన పంజా విసురుతోంది. తాజాగా భారత్‌లో మరో మంకీ పాక్స్ కేసు నమోదైంది. హెల్త్ ఎమర్జెన్సీకి కారణం అయిన ‘క్లేడ్ 1బీ’ రకం భారత్‌లోకి ప్రవేశించింది. కేరళకు చెందిన ఓ యువకుడికి ఈ వ్యాధి నిర్ధారణ అయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. యూఏఈ నుంచి ఇటీవలే వచ్చిన వ్యక్తికి లక్షణాలు ఉండడంతో అనుమానం వచ్చి పరీక్షలు చేయగా.. అతడికి పాజిటివ్‌గా తేలింది. ఇంతకు ముందు కూడా భారత్‌లో ఎంపాక్స్ కేసులు నమోదైనా కానీ అవి క్లేడ్ 1బీ రకానికి చెందినవి కావు. వాటితో పోల్చితే ఇది చాలా ప్రమాదకరం. కోతుల్లో మొదట ఈ వ్యాధి వెలుగు చూసింది.