calender_icon.png 10 January, 2025 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో డ్రా..

08-12-2024 12:40:31 AM

  1. డ్రాగా ముగిసిన పదో రౌండ్
  2. వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్

  3. సింగపూర్: వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌లో మరో గేమ్ డ్రాగా ముగిసింది. భారత యువ సంచలనం గుకేశ్ లిరెన్ మధ్య జరిగిన 10వ గేమ్ కూడా డ్రా అయింది. వరుసగా ఏడో మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది. 10 గేముల తర్వాత ఇద్దరు ప్లేయర్లు చెరి 5 పాయింట్లతో నిలిచారు. విజయం సాధించేందుకు ఇంకా 2.5 పాయింట్లు అవసరం. ఈ చాంపియన్‌షిప్ నెగ్గిన ప్లేయర్‌కు 2.5 మిలియన్ యూఎస్ డాలర్లు ప్రైజ్‌మనీగా లభిస్తాయి. మొదటి గేమ్‌ను లిరెన్ సొంతం చేసుకోగా.. మూడో గేమ్‌ను గుకేశ్ దక్కించుకున్నాడు. ఇక అక్కడి నుంచి ప్రతి గేమ్ కూడా డ్రా అవుతూ వస్తోంది.