calender_icon.png 14 October, 2024 | 8:12 AM

రాజీనామా బాటలో మరో 77 మంది డాక్టర్లు

14-10-2024 03:55:55 AM

బెంగాల్ హెల్త్ వర్సిటీ రిజస్ట్రార్‌కు ఈ మెయిల్

కోల్‌కతా, అక్టోబర్ 13: ఆర్జీకర్  హాస్పిటల్‌లో ట్రైనీడాక్టర్ హత్యాచార ఘటనలో బాధితురాలకి న్యాయం చేయాలంటూ జూనియర్ డాక్టర్లు ఈ నెల 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా సంఘీభావం తెలుపుతూ కల్యాణి జేఎన్‌ఎం హాస్పిటల్‌కు చెందిన 77 మంది డాక్టర్లు కూడా తమ పదవులకు రాజీనామా చేస్తామని తెలిపారు.

ఈ మేరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్‌కు ఈ పంపారు. ఈ నెల 14 వరకు గడువు ఇస్తున్నామని, ఆ లోగా తమ డిమాండ్స్ నెరవేర్చకపోతే డ్యూటీలకు వెళ్లబోమని ఈ మెయిల్‌లో హెచ్చరించారు. అంతేకాక తాము ఎదుర్కొంటున్న మానసిక ఇబ్బందులు, ప్రస్తుతం తాము డ్యూటీ చేయకపోవడానకి గల కారణాలను వెల్లడించారు.

బాధితురాలికి న్యాయం చేయడం, రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శ నిగంను వెంటనే తొలగించాలని, తమకు భద్రతా కల్పించాలని వారు కోరారు.ఇప్పటికే ఆర్జీకర్ హాస్పిటల్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ హాస్పిటల్స్‌లో పనిచేస్తున్న 200 మందికి పైగా సీనియర్ వైద్యులు దీక్షకు మద్దతు తెలిపి తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.