07-04-2025 01:16:58 AM
హైదరాబాద్, ఏప్రిల్ 6: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటముల ప రంపర కొనసాగుతోంది. ఇప్పటికే హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకున్న కమిన్స్ సేన ఆదివారం గుజ రాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. సుందర్(49)కి తోడు కెప్టెన్ గిల్ (61*) అర్ధ సెంచరీ సాధించడంతో గుజరాత్ గెలుపు సులువయింది. గుజరాత్ మరో 20 బంతులు మిగులుండగా నే విజయఢంకా మోగించింది.
ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆ రెంజ్ ఆర్మీ వరుసగా నాలుగు పరాజయాలు చవి చూసింది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అట్టడుగున కొ నసాగుతున్న హైదరాబాద్ ఈ ఓటమితో చివరి స్థానాన్ని మరింత సుస్థి రం చేసుకుంది.
హైదరాబాదీ బౌలర్ సిరాజ్ 4 వికెట్లతో ఆరెంజ్ ఆర్మీ నడ్డి విరిచాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు ది గిన ఆరెంజ్ ఆర్మీ టాపార్డర్ మరోసారి విఫలమైంది. గుజరాత్ బౌలర్ల ధాటికి మన బ్యాటర్లు పరుగులు చే సేందుకు అపసోపాలు పడ్డారు. చివరికి హైదరాబాద్ 152 పరుగులు చేసింది.