calender_icon.png 23 December, 2024 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంబైకి మరో ఓటమి

23-12-2024 12:10:04 AM

  1. ఫ్లేఆప్స్ అవకాశాలు మరింత క్లిష్టం
  2. మరో ఓటమి చవిచూసిన బెంగళూరు
  3. పీకేఎల్ 11

పూనే: ప్రొకబడ్డీ లీగ్ ప్లేఆఫ్స్ అవకాశాలను ముంబై మరింత సంక్లిష్టం చేసుకుంది. ఆదివారం 30-47 తేడాతో హర్యానా మీద ఘోరంగా ఓడిపోయింది. తొలి నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన హర్యానా చివరికి సునాయస విజయాన్ని దక్కించుకుంది. ముంబై ప్లే ఆఫ్స్ చేరుకోవాలంటే 24న బెంగాల్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి తలెత్తింది.

ఇప్పటికే ఐదు జట్లు ప్లే ఆఫ్ బెర్తులను ఖాయం చేసుకోగా.. ఆరో బెర్తు కోసం తెలుగు టైటాన్స్, యూ ముంబా జట్ల మధ్య పోటీ నెలకొంది. తెలుగు టైటాన్స్ 22 మ్యాచులాడి 12 విజయాలు సాధించింది. ముంబై జట్టు 21 మ్యాచ్‌ల్లో 11 విజయాలతో ఉంది. 24 నాటి మ్యాచ్‌లో విజయం సాధిస్తే ముంబై తేలిగ్గా ప్లేఆఫ్ బెర్తు ఖాయం చేసుకుంటుంది.

ఒక వేళ యూ ముంబా కనుక ఓడిపోతే తెలుగు టైటాన్స్ ఆరో జట్టుగా ప్లే ఆఫ్ బెర్తును ఖాయం చేసుకుంటుంది. హర్యానా స్టీలర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం సతీష్ కన్నన్ తప్ప మిగతా ఏ ముంబై రెయిడర్ కూడా రాణించలేదు. అదే సమయంలో హర్యానాలో శివమ్ సూపర్ టెన్ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 22 మ్యాచ్‌లు ఆడిన హర్యానా 16 విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది. 

మారని తీరు.. బెంగళూరుకు మరో ఓటమి

ఈ లీగ్‌లో అత్యంత చెత్త జట్టు ఏదయినా ఉందా అంటే అది బెంగళూరు బుల్స్ అని చెప్పాలి. ఇప్పటి వరకు 21 మ్యాచెస్ ఆడిన బుల్స్ కేవలం 2 విజయాలు మాత్రమే సాధించింది. జట్టులో పర్‌దీప్ నర్వాల్ వంటి స్టార్ రెయిడర్ ఉన్నా కానీ బెంగళూరుకు మాత్రం లక్ కలిసి రావడం లేదు. తాజాగా 32 తేడాతో తమిళ్ తలైవాస్ మీద పరాజయం చవి చూసింది. తలైవాస్‌లో ఆల్‌రౌండర్ హిమాన్షు సూపర్ టెన్ సాధించాడు. నేడు గుజరాత్‌తో ఢిల్లీ, పునేరితో తమిళ్ తలపడనున్నాయి.