calender_icon.png 20 September, 2024 | 2:11 PM

చైనాలో మరో డెడ్లీ వైరస్

09-09-2024 12:00:00 AM

  1. మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న వెట్‌లాండ్ వైరస్(వెల్వ్) 
  2. కీటకాల ద్వారా మానవుల్లోకి వ్యాప్తి 
  3. రోగికి జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఇటీవల ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్ వైరస్ పుట్టుకకు కేంద్ర బిందువైన చైనా దేశంలో మరో కొత్తరకం వైరస్ పురుడు పోసుకుంది.  అదే వెట్‌లాండ్ వైరస్(వెల్వ్). 2019 ఏడాదిలో చైనాలోని జిన్‌జఓఔ నగరంలో 61 ఏళ్ల రోగి లో తొలిసారిగా ఈ వైరస్‌ను గుర్తించారు. బా ధితుడు మంగోలియాలోని చిత్తడి నేలల్లో పే లు కాటుకు గురైన ఐదురోజుల అనంతరం ఈ వైరస్ అతడిలో బయటపడిందని ది న్యూ ఇం గ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించారు. 

వైరస్ లక్షణాలు..

ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కన్పిస్తాయని వైద్యులు తెలుపుతున్నారు. వెల్వ్ ఆర్‌ఎన్‌ఏ గొర్రెలు, గుర్రాలు, పందులు, ట్రాన్స్‌బైకల్ జోకోర్ అని పిలువబడే ఎలుకల్లో కూడా కనుగొన్నారు. ఈ వైరస్ మానవుల్లో తీవ్రమైన అనారోగ్య ప్రభావాలను చూపిస్తోంది. జంతువుల్లో కూడా ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది. ఈవైరస్‌కి సరైన ట్రీట్‌మెంట్ లభించకపోతే మెదడు, వెన్నెముక ద్రవంలో అధిక తెల్ల రక్త కణాల సంఖ్య కారణంగా రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది.