అధికారుల క్రాస్ ఎగ్జామినేషన్‌కు కసరత్తు
హైదరాబాద్ చేరుకున్న జస్టిస్ పీసీఘోష్
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్ర మాలు, అవకతవకలను విచారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ మరో దఫా విచారణకు సిద్ధమయ్యింది. బుధవారం సాయం త్రం జస్టిస్ పీసీఘోష్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. గురువారం నుంచి విచారణ చేప ట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. పలుమార్లు తుది నివేదికను పం పించాలని విజిలెన్స్ విభాగానికి లేఖ రాసిన నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం ద్వారా విజిలెన్స్ నివేదిక జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు చేరింది.
ఈ నేపథ్యంలో ఈ దఫా విచారణలో విజిలెన్స్ నివేదికలో పొందుపర్చిన అంశాలపై అధికారులు, ఇంజినీర్ల నుంచి సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉందని సమాచారం. దీనితోపాటు ఇప్పటికే అఫిడవిట్లు ఇచ్చిన అధికారులు, ఇంజినీర్లు, ఇతరులను ఘోష్ కమిషన్ క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకావం ఉందని సమాచారం. ఇప్పటికే అఫిడవిట్ రూపంలో అధికారులు, ఇంజనీర్ల నుంచి సమాచారం రాబట్టిన కమిషన్.. ఇప్పుడు ఆ సమాచారంపై లోతుగా ప్రశ్నిస్తూ.. క్రాస్ ఎగ్జామిన్ చేస్తారని తెలుస్తోంది.
అయితే ఇందుకు సంబంధించి నోటీసులు జారీ చేసినట్టుగా చెబుతున్నప్పటికీ అధికారికంగా దానిని నిర్ధారించడం లేదు. అయితే ఇటు విజిలెన్స్ నివేదిక.. అటు క్రాస్ ఎగ్జామిన్ చేస్తారని వినపడుతున్నందున.. ఈ దఫా కమిషన్ విచారణలో మరింత లోతైన సమాచారం బయటపడే అవకాశం ఉందని చర్చిస్తున్నారు. అంతేకాకుండా కాళేశ్వరం అవినీతి వెనుక ఉన్న కీలక వ్యక్తుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చేసే విచారణపై అందరి దృష్టి కేంద్రీకరించారు.