calender_icon.png 28 November, 2024 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో మరో సైబర్ క్రైమ్ మోసం

18-05-2024 01:47:51 AM

మహారాష్ట్ర పోలీసు అధికారినంటూ బెదిరింపు 

మహిళను మోసగించి రూ.60 లక్షలు కాజేసిన కేటుగాడు

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 17 (విజయక్రాంతి): ఇటీవలి కాలంలో సైబర్ నేరగా ళ్లు రెచ్చిపోతున్నారు. అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రజలు సైబర్ నేరాల భారీన పడకుండా సెంట్రల్ సైబర్ క్రైమ్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ.. ఎక్కడో చోట సైబర్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం నగరంలో మరో సైబర్ మోసం జరిగింది. నగరానికి చెందిన ఓ మహిళకు సైబర్ నేరగాడు ఫోన్ చేసి మహారాష్ట్ర పోలీసు అధికారినంటూ ఆమెను నమ్మించాడు.

మీరు మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా ఉన్నారని, మీ కేసు కొట్టివేయాలంటే రూ.60 లక్షలను చెల్లించాల్సి ఉంటుందని, తాను చెప్పిన అకౌంట్‌కి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయాలని భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో బయపడిపోయిన మహిళ, ఆమె ఖాతాలో ఉన్న రూ.60 లక్షలను వారు చెప్పిన ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసింది. కొద్దిసేపటి తర్వాత మోసపోయానని గ్రహించిన మహిళ వెంటనే సైబర్ క్రైమ్‌కి ఫిర్యాదు చేసింది. దీంతో అప్రమత్తమైన సైబర్ క్రైమ్ పోలీసులు మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నేరస్థుడి బ్యాంకు ఖాతా ఫ్రీజ్ చేశారు.