- స్పేడెక్స్ విజయవంతం
- నిప్పులు చిమ్ముతూ నింగిలోకి
- వాయిదా పడినా విజయవంతం అయిన ప్రయోగం
- అంతరిక్షంలో ట్రాఫిక్ వల్లే ప్రయోగం ఆలస్యం
- సంబురాల్లో మునిగిన తేలిన ఇస్రో శాస్త్రవేత్తలు
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సీ-60
స్పేడెక్స్ ప్రయోగం సక్సెస్
- సొంత అంతరిక్ష కేంద్రం
- ఏర్పాటులో మరో ముందడుగు
- మరింత పెరిగిన భారత కీర్తి
సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించుకోవడంలో భారత్ ముందడుగు వేసింది. సోమవారం ఇస్రో స్పేడెక్స్ ప్రయోగం విజయవంతమయింది. శ్రీహరికోటలోని మొదటి లాంచింగ్ పాడ్ నుంచి రాత్రి 10.15 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ-60 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అంతకు ముందు అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో, ప్రయోగం రెండు నిమిషాలు వాయిదా పడింది.
ప్రత్యేకంగా డిజైన్ చేసిన రెండు ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. ఈ రెండు ఉపగ్రహాలు భూమికి 470 కిలోమీటర్ల దూరంలో అనుసంధానం అయ్యేందుకు ప్రయ త్నిస్తాయి. ప్రయోగం విజయవంతం అవడంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ప్రయోగం విజయవంతంతో చైనా, అమెరికా, రష్యా దేశాల సరసన భారత్ నిలిచింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 30: సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలన్న భారత కలకు మరో ముందడుగు పడింది. సోమవారం ఇస్రో ప్రయోగించిన స్పేడెక్స్ విజయవంతమయిం ది. శ్రీ హరికోటలోని మొదటి లాంచింగ్ పాడ్ నుంచి చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమవడంతో ఇస్రో మరో మైలురాయిని చేరుకుంది.
ఇప్పటి వరకు స్పేస్ డాకింగ్ టెక్నాలజీని కేవలం రష్యా, అమెరికా, చైనా మాత్రమే ప్రయోగించాయి. ఈ ప్రయోగం విజయవంతంతో భారత్ ఆ దేశాల సరసన చేరనుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కేవలం ఇస్రో శాస్త్రవేత్తలు అనే కాకుండా యావత్ దేశం కూడా ఇస్రో సాధించిన ఘన విజయం పట్ల ఆనందంతో ఊగిపోయారు.
ఇదే మొదటిది..
ఇస్రో ఇప్పటి వరకు ఎన్నో తరహా ప్రయోగాలు చేసినా కానీ స్పేస్ డాకింగ్ టెక్నాలజీ మీద ప్రయోగం చేపట్టడం ఇదే తొలిసారి. మొదట సోమవారం రాత్రి 9.58 నిమిషాలకు ప్రయోగం చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసినా కానీ అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ వల్ల ప్రయోగం రెండు నిమిషాల పాటు ప్రయోగం వాయిదా పడింది. ప్రయోగం వాయిదా పడినా కానీ సక్సెస్‌ను మాత్రం రుచి చూసింది. ఈ రాకెట్ ద్వారా ప్రత్యేకంగా డిజైన్ చేసిన రెండు ఉపగ్రహాలను నింగిలోకి పంపారు.
‘టార్గెట్’తో కలిసి ‘చేసర్’
ఈ ప్రయోగం ద్వారా ఒక్కోటి 220 కేజీల బరువున్న రెండు ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు నింగిలోకి పంపారు. ఈ రెండు ఉపగ్రహాలకు చేసర్ (ఎస్‌డీఎక్స్01), టార్గెట్ (ఎస్‌డీఎక్స్ 02) అనే పేర్లు పెట్టారు. ఈ రెండు ఉపగ్రహాలు భూమికి 470 కిలోమీటర్ల దూరంలో అనుసంధానం అయ్యేం దుకు ప్రయత్నిస్తాయి. ఇప్పటి వరకు ఇటువంటి తరహా సాంకేతికతతో కేవలం మూడు దేశాలు మాత్రమే ప్రయోగాలు చేసి విజయవంతం అయ్యాయి. ఈ విజయంతో భారత్ ఆ దేశాల సరసన చేరింది.
ఎందుకంత కీలకం..
స్పేడెక్స్ విజయం అనేది భారత్‌కు ఎంతో కీలకం అని చాలా మంది చెబుతున్నారు. స్పేడెక్స్ విజయం మీద అనేక అంశాలు ఆధారపడి ఉన్నాయి.
* గగన్‌యాన్ (మానవ సహిత అంతరిక్ష ప్రయోగం)
* చంద్రయాన్ మిషన్.. చంద్రశిలల సేకరణ, జాబిల్లిపై భారత వ్యక్తిని దింపడం
* భారతీయ అంతరిక్ష కేంద్ర అభివృద్ధి
* ఈ ప్రయోగంలో స్పేడెక్స్ మిషన్‌తో పాటు మరో 24 పేలోడ్‌లను కూడా అంతరిక్షంలోకి పంపించి ప్రయోగాలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
10 రోజుల తర్వాతే..
ఇస్రో స్పేస్ డాక్స్ మిషన్‌ను సోమవారం రోజు విజయవంతంగా ప్రయోగించింది కానీ అందులో ఉన్న రెండు ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి డాకింగ్ అయ్యేందుకు మా త్రం 10 నుంచి 14 రోజుల సమయం పడుతుందని అంతరిక్ష సంస్థ పేర్కొంది. జనవరి 7న డాకింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు వారు తెలిపారు. మొదటి స్పేస్ క్రాఫ్ట్‌లో హై రిజల్యూషన్ కెమెరా, రెండో స్పేస్‌క్రాఫ్ట్‌లో మినియేచర్ తదితరాలు ఉన్నాయి.
2024కు విజయంతో ముగింపు
ఇది 2024లో ఇస్రో చేపట్టిన ఆఖరి ప్రయోగం. ఇస్రో ఈ ప్రయోగంలో కూడా విజయం సాధించి 2024కు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ నెల 5వ తేదీనే ఇస్రో పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం ద్వారా యురోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 2025ను నూతనోత్సాహంతో ప్రారంభించనుంది. 2025లో కీలక ప్రయోగాలు ఇస్రో చేపట్టి.. దేశ కీర్తిని మరింత పెంచాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఇస్రో...
అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్
ముందు నిర్ణయించిన ప్రకారం ఈ మిషన్‌ను రాత్రి 9.58 గంటలకు నింగిలోకి పంపాల్సింది కానీ అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తడం వల్ల ఈ ప్రయోగాన్ని రెండు నిమిషాల పాటు వాయిదా వేశారు. రాత్రి 10 గంటల 15 సెకన్లకు పీఎస్‌ఎల్వీ సీఠూ రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ‘అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ప్రయోగం రెండు నిమిషాలు వాయిదా పడింది. రాకెట్ వెళ్లాల్సిన కక్ష్యలో ఇతర ఉపగ్రహాలు అనుసంధానం చెందడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది’ అని సోమనాథ్ వెల్లడించారు. ఇలా అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడడం ఇదే తొలిసారి కాదు. చంద్రయాన్ ప్రయోగ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది.
లక్ష్యమిదే..
స్పేడెక్స్ మిషన్ లక్ష్యం ఏంటని చాలా మంది ఆరాలు తీస్తున్నారు. అంతరిక్షంలోనే ఉపగ్రహాలను ఒకదానితో ఒకటి అనుసంధానించడం, అన్ డాకింగ్ చేయడమే దీని లక్ష్యం. అంతే కాకుండా ఈ మిషన్‌లో ప్రయోగించిన రెండు వ్యోమనౌకలను కూడా అంతరిక్షంలోనే అనుసంధానించనున్నారు.
డాకింగ్‌కు మరో వారం
పీఎస్‌ఎల్వీ సీ-60 ప్రయోగం విజయం కావడం ఆనందాన్నిచ్చింది. వాహన నౌకలో ఉన్న రెండు ఉపగ్రహాలను కూడా కక్ష్యలోకి ప్రవేశపెట్టాం. ఇది మిషన్‌లో తొలిభాగం. జనవరి 7న డాకింగ్ జరిగే అవకాశం ఉంది.
సోమనాథ్, ఇస్రో చైర్మన్