హైదరాబాద్: క్రికెటర్ సిరాజ్ కు విద్యార్హత లేకున్నా గ్రూప్-1 ఉద్యోగం ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో మరో క్రికెట్ స్టేడియం వస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. యూసుఫ్ గూడ, గచ్చిబౌలి, సరూర్ నగర్ స్టేడియాల్లో క్రీడలు తగ్గాయని సీఎం పేర్కొన్నారు. ఎల్ బీ స్టేడియంలో క్రీడలు తగ్గాయి.. రాజకీయ కార్యకలాపాలు పెరిగాయని సీఎం ఆరోపించారు. క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని తెలిపారు. నిఖత్ జరీన్ కు ఆర్థిక సాయం చేశాం.. ఇంటిస్థలం కేటాయించామని సూచించారు. హరియాణా క్రీడా విధానం పరిశీలిస్తున్నామన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో త్వరలో క్రీడా విధానం తెస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.