calender_icon.png 30 October, 2024 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో వివాదంలో పూజా ఖేద్కర్

18-07-2024 12:05:00 AM

దివ్యాంగ ధ్రువీకరణకు తప్పుడు అడ్రస్ ఇచ్చిన ట్రెయినీ ఐఏఎస్

ఎంక్వైరీలో అక్కడ ఫ్యాక్టరీ ఉన్నట్లుగా తేల్చిన అధికారులు

న్యూ ఢిల్లీ: ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు దివ్యాంగ ధ్రువీకరణకు చూపిన అడ్రస్‌లో ఓ పరిశ్రమ ఉన్నట్లు తేలింది. 2022 ఆగస్టు 24న యశ్వంత్ రావ్ మెమోరియల్ ఆసుపత్రి ఆమెకు వైకల్య ధ్రువీకరణ పత్రం ఇచ్చింది. దానిలో ఆమె చించ్వాడ్‌లో కర్మాగారం చిరునామాను ఇచ్చింది. ఆమె సమర్పించిన అడ్రస్‌లో ఓ ఇంజినీరింగ్ కంపెనీ ఉంది. ఆమె ఉపయోగించిన ఆడీ కారు కూడా ఇదే కంపెనీ పేరుతో రిజిస్టరై ఉంది.

వైకల్య ధ్రువీకరణ కోసం ఆధార్‌కార్డు తప్పనిసరి అయినప్పటికీ పూజా రేషన్ కార్డు మాత్రమే సమర్పించింది. వైకల్యం సర్టిఫికెట్‌లో ఆమె మోకాలికి పాత గాయం ఉన్నట్లు పూజా పేర్కొంది. అయితే తాజాగా జరిపిన వైకల్య పరీక్షల్లో ఆమె మోకాలి వద్ద కేవలం 7శాతం మాత్రమే వైకల్యం కలిగిఉందని వైద్యులు తేల్చారు. వాస్తవానికి యూపీ ఎస్సీలో పీహెచ్‌సీ రిజర్వేషన్ పొందాలంటే 40శాతం కంటే తక్కువ వైకల్యం కలిగి ఉండకూడదు. అయితే ఆమె ఆ కేటగిరీలో ఎలా ఎంపికైందనే విషయం తేలాల్సి ఉంది.