calender_icon.png 26 November, 2024 | 5:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగిత్యాలలో మరో వివాదం

25-10-2024 01:29:36 AM

కరీంనగర్, అక్టోబరు 24 (విజయక్రాంతి): జగిత్యాలలో మరో వివాదం చోటు చేసుకుంది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ వెళ్తే ఎస్‌ఐ తనపైనే కౌంటర్ ఫైల్ చేశాడంటూ జీవన్‌రెడ్డి అనుచరుడు, జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేట గ్రామానికి చెందిన వెంకటరాజం ఆరోపించారు. తనకు చెందిన 8 గుంటల స్థలాన్ని చదును చేసుకున్న సమయంలో అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేశారని, వచ్చినవారిలో ఒకరు వార్డు కౌన్సిలర్ పూసల అనిల్  అని గురువారం పేర్కొన్నారు.

తాము ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అనుచరులమని తెలుపుతూ తనపై దాడి చేసి, నువ్వు జీవన్ రెడ్డి మనిషివి అంటూ దూషించారని, ఇదే విషయమై జగిత్యాల రూరల్ ఎస్‌ఐకి ఫిర్యాదు చేయగా, తిరిగి తనపైనే కౌంటర్ ఫైల్ చేశారని ఆయన ఆరోపించారు. రూరల్ ఎస్‌ఐకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.

ఫిర్యాదుదారులపై దురుసుగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, వెంటనే ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన స్థలం కబ్జా చేసినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తన వద్ద ఉన్న డాక్యుమెంట్లను చూసి న్యాయం చేయాలని కోరారు.

తిప్పన్నపేట గ్రామ శివారులో తమ ముగ్గురు తాతలకు కలిపి 327 సర్వే నెంబర్‌లో 27 గుంటల భూమి ఉం డగా ఇద్దరి వారసులు 18 గుంటల భూమిని మౌర్య గ్లోబల్ స్కూల్ యాజమాన్యానికి గతంలోనే అమ్ముకున్నారని, మిగతా 9 గుం టల భూమి తన తండ్రి గారికి సంబంధించినదని వివరించారు. ఈ భూమి విషయమై తమపై కోర్టులో వేశారని, కానీ కోర్టు కేసు కొట్టివేసిందని వెంకటరాజం వివరించారు.