calender_icon.png 5 October, 2024 | 6:53 AM

హిమాచల్‌లో మరో వివాదం

05-10-2024 01:37:08 AM

టాయిలెట్లపై పన్ను విధించిన ప్రభుత్వం!

షిమ్లా, అక్టోబర్ 4: ఉచితాల పేరుతో ఊదరగొట్టి హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని అమలు చేసేందుకు నానా కష్టాలు పడుతోంది. ఈ క్రమంలో ఓ తాజాపన్ను ప్రవేశపెట్టి తీవ్ర విమర్శల పాలవుతోంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరు కున్న సుఖ్విందర్‌సింగ్ సర్కార్ మరుగుదొడ్ల వాడకంపై పన్నులు విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

పట్టణ ప్రాంతాల్లో ఒక్కో టాయిలెట్ సీటుకి నెలకు రూ.25 చొప్పున ప్రజల నుంచి వసూలు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇంట్లో ఎన్ని టాయిలెట్లు ఉంటే అన్నింటికీ పన్ను చెల్లిం చాల్సిందేనని స్పష్టం చేసింది. ఈనెల నుంచే ప్రభుత్వం నెలకు రూ.100 చొప్పున నీటి బిల్లులను అమల్లోకి తీసుకువచ్చింది. హిమాచల్‌ప్రదేశ్‌లో 10లక్షలకుపైగా ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు.

ఓ వైపు స్వచ్ఛ్ భారత్ పేరుతో కేంద్రం టాయిలెట్ల వాడకాన్ని ప్రోత్సహిస్తుంటే మరోవై పు వాటి వినియోగంపై పన్ను వేయడం హస్యాస్పదంగా ఉందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ నిర్ణయాన్ని హిమాచల్ ప్రభుత్వం వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది.