హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు(BRS Working President KT Rama Rao)పై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. కేటీఆర్ పై బీసీ రాజకీయ ఐకాస అధ్యక్షుడు యుగంధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఓఆర్ఆర్ టెండర్లలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓఆర్ఆర్ టెండర్లపై విచారణ జరపాలని ఏసీబీకి ఫిర్యాదు చేశారు. కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఏసీబీ విచారణకు న్యాయవాదిని అనుమతించాలంటూ కేటీఆర్ పిటిషన్ లో పేర్కొన్నారు. రేపు విచారణకు రావాలని కేటీఆర్ కు ఏసీబీ(ACB) అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా, ఫార్ములా-ఇ రేస్(Formula-E race case) కేసులో ఆరోపణలపై ఏసీబీ విచారణకు కేటీఆర్(KTR) తరఫు న్యాయవాదిని ఆయన వెంట వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో సోమవారం బంజారాహిల్స్‌లోని అవినీతి నిరోధక శాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫార్ములా-ఇ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ సమన్ల మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు రామారావు వాహనాన్ని ఏసీబీ కార్యాలయం వెలుపల నిలిపివేశారు.