16-02-2025 03:03:23 PM
మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్
మంథని,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకముగా నిర్వహించిన గత సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల గణన సర్వేలో తాళం వేసిన ఇండ్లు, ఆసక్తి షలేకపోవడం మొదలైన కారణాల వలన సర్వేలో పాల్గొనని కుటుంబాల వారు మళ్లీ సర్వే కోసం దరఖాస్తులు చేసుకోవాలని మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్ ఒక ప్రకటనలో ఆదివారం కోరారు.
నేటి నుంచి ఈ నెల 28 తేదీ వరకు మరల నమోదు చేసుకోవడం కొరకు ప్రభుత్వం అవకాశము కల్పించిందని, కావున సర్వే కాని కుటుంబాలు ఈ అవకాశం వినియోగించుకోనుటకు తేది 16.02.2025 నుండి 28.02.2025 వరకు ఉ. 10.00 గంటల నుండి సా.5.00 గంటల వరకు మునిసిపల్ కార్యాలయములో ప్రజా పాలన సేవా కేంద్రంలో దరఖాస్తులు ఉంచబడినవి. ఈ దరఖాస్తులు తీసుకొని వివరాలు నమోదు చేసి ఇవ్వలని కమిషనర్ మంథని మున్సిపల్ ప్రజలను కోరారు.