calender_icon.png 30 October, 2024 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళకు మరో అవకాశం

18-07-2024 03:26:56 AM

  • జిల్లాలో 8 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు 
  • మహిళలకు ఆర్థికంగా మరింత ప్రోత్సాహం 
  • ఎంపికైన స్వయం సహాయ సంఘాలకు బ్యాంక్ రుణాలు 
  • మహిళలకు మాస్టర్ చెఫ్‌ల ద్వారా పది రోజుల శిక్షణ 

వికారాబాద్, జూలై 17 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్థిక చేయూతనందించేందుకు ఇందిర మహిళా శక్తి క్యాం టీన్లను ఏర్పాటు చేయనుంది. మహిళా సం ఘాల సభ్యులుగా నగదు పొదుపు చేస్తూ, బ్యాంక్ రుణాల ద్వారా ఇప్పటికే వ్యాపారా ల్లో రాణిస్తున్న మహిళలను మరింత ప్రోత్సహించేలా ప్రభుత్వం మరో పథకానికి శ్రీకా రం చుట్టింది. జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో మహిళల చేత  క్యాంటీన్ల ఏర్పాటుకు నిర్ణయించింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలో అనువైన ప్రాం తాల గుర్తింపు మొదలు పెట్టారు. తొలిదశ లో ప్రయోగాత్మకంగా మోప్మా ఆధ్వర్యంలో మూడు చోట్ల, డీఆర్‌డీఏ తరఫున ఐదు చోట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

స్వయం సహాయక సంఘాలతో..

ఇందిరా క్యాంటీన్ల నిర్వహణ పూర్తిగా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)కే అప్పగించనున్నారు. మొదటి దశలో వికారాబాద్ జిల్లాకు 8 క్యాంటీన్లు ఏర్పాటు చేసు కునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. మొదటి దశ క్యాంటీన్ల నిర్వహణలో మంచి ఫలితాలు వస్తే రెండో దశలో మండల కేం ద్రాలు, పెద్ద గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఒక మహిళా సంఘం పేరుమీద మంజూరైన క్యాంటీన్‌ను మరొకరు నడిపితే వెంటనే రద్దు చేసి మరో మహిళా సంఘానికి అప్పగించే విధంగా అధికారులు నియమాలు సిద్ధం చేశారు.

ఇందు కోసం రుణాలు తీసుకుని సద్వినియోగం చేసుకోవడంతో పాటు తిరిగి సక్రమంగా చెల్లిస్తున్న మహిళా సంఘాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. బ్యాంకర్లతో సమీక్షంచాక సంఘాలను ఎంపిక చేయనున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.  

బ్యాంకు నుంచి రుణాలు..

జిల్లాలో క్యాంటీన్ల ఏర్పాటుకు ఎంపిక చేసిన స్వయం సహాయక సంఘాలకు బ్యాం కుల నుంచి లింకేజీ రుణాలు ఇప్పిస్తారు. ఒక్కో సంఘంలో పదిమంది సభ్యులు ఉండటంతో పాటు వంటలు చేయడంలో అనుభ వం, క్యాటరింగ్ నిర్వహణ అంశాలను ఎంపికకు అర్హతలుగా పరిగణలోకి తీసుకుంటు న్నారు. ఇప్పటికే ప్రతి మహిళా సంఘం నుంచి వివరాలు సేకరించారు. ఎం పికైన సంఘాల సభ్యులకు హైదరాబాద్‌లో మాస్ట ర్ చెఫ్ ద్వారా పది రోజుల పాటు క్యాంటీన్ల నిర్వహణ, వంటల తయారీలో శిక్షణ సైతం ఇప్పిస్తారు.

ఇప్పటికే పలువురు మహిళా సంఘాల సభ్యులు క్యాటరింగ్ నిర్వహణ, పిండి వంటలు, పచ్చళ్ల తయారీలో రాణిస్తున్నారు. ఇలాంటి వారినే క్యాంటీన్ల నిర్వహ ణకు ఎంపిక చేసి తక్కువ ధరతో నాణ్యత కలిగిన టిఫిన్, భోజనం అందుబాటులోకి తేవాలని ప్రాథమికంగా నిర్ణయించారు. 

శిక్షణతోపాటు బ్యాంక్ రుణాలు ఇప్పిస్తాం 

జిల్లాలో మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేర కు జిల్లాలో రద్దీ ప్రాంతాలను, ఐకేపీ, మెప్మా ఆధ్వర్యంలో గుర్తిస్తున్నాం. రద్దీగా ఉండే ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటుకు మొదటి ప్రాధాన్యమిస్తు న్నాం. మండల కేంద్రాల్లో మూడు, నాలుగు ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉంటే అక్కడ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నాం. మహిళా శక్తి క్యాంటీన్లకు ఎంపికైన సంఘాల మహిళలకు శిక్షణ తో పాటు, బ్యాంక్ రుణాలు ఇప్పిస్తాం.  

 శ్రీనివాస్, డీఆర్డీవో, వికారాబాద్