అమరావతి: మాజీ మంత్రి కొడాలినానికి మరో షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సీపీ నేతలపై వరసగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా కొడాలి నానిపై గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మరో కేసు బుక్ అయింది. ఆయనపై ఇప్పటికే పలు కేసులున్నా విషయం తెలిసిదే. తాజా కేసు ప్రకారం.... కొద్ది రోజులకే తన తల్లి మనస్థాపంలో మరణించిందని, తన తల్లి మరణానికి కొడాలి నాని కారణమంటూ గుడివాడకు చెందిన ఆటోనగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కొడాలి నానితో పాటు ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవిలతారెడ్డిలను కూడా తన ఫిర్యాదులో నిందితులుగా పేర్కొన్నాడు. తన తల్లి మరణానికి వాసుదేవరెడ్డి, కోడాలి నాని కారణమయ్యారంటూ బాధితుడు ఫిర్యాదులో వాపోయాడు. తమ గోదాములో ఉన్న లిక్కర్ కేసులను పగలకొట్టి తగులబెట్టారని ప్రభాకర్ ఫిర్యాదు చేశాడు. తమ బాధ చెబితే వాసుదేవరెడ్డి, మాధవిలత దూషించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో వీరిపై కేసు నమోదు చేసుకుని 448, 427,506, ఆర్ అండ్ డబ్ల్యూ 34 సెక్షన్ల కింద ఎఫ్ఐర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.