- ఈమెయిల్స్‌తో తనను వేధిస్తున్నాడని బాధితురాలి ఫిర్యాదు
- నిందితుడి కోసం పోలీసుల గాలింపు
రాజేంద్రనగర్, సెప్టెంబర్ 6: యూట్యూబర్ హర్షసాయి తనపై లైంగికదాడికి పాల్పడి, న్యూడ్ ఫొటోలు, వీడియోలతో బెదిరిస్తున్నాడని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యా దు చేసిన యువతి గురువారం మరోసారి స్టేషన్‌కు వచ్చి.. హర్షసాయి తనను ఈమెయిల్స్‌తో వేధిస్తున్నాడని మరో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు హర్షసాయిపై మరో కేసు నమోదుచేశారు. కాగా గత కొన్నిరోజులుగా పరారీలో ఉన్న యూట్యూబర్ హైర్షసాయి ఆచూకీ పోలీసులు ఎంతవెతికినా తెలియడం లేదు. ఈ క్రమంలో హర్షసాయిని పట్టుకునేందుకు పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితుడిని పట్టుకుని విచారిస్తే గానీ మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని త్వరలో నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.