28-02-2025 01:36:21 PM
హైదరాబాద్: మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi ) ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మరో కేసు నమోదైంది. బాచుపల్లి పోలీసులు హరీష్‌రావుపై కేసు నమోదు చేశారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు హరీశ్ రావుపై కేసు బుక్ అయింది. హరీశ్ రావుతో పాటు మరో ముగ్గురి నుంచి ప్రాణహాని ఉందని చక్రధర్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హరీశ్ రావుపై 351(2), ఆర్ డబ్ల్యూ3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హరీశ్ రావుతో పాటు సంతోష్ కుమార్, రాములు, వంశీపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇటీవలే హరీష్‌రావు అనుచరులు జైలు నుంచి విడుదలైయ్యారు.