calender_icon.png 1 November, 2024 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్‌పై మరో కేసు

12-05-2024 12:35:52 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 11 (విజయక్రాంతి) : బీజేపీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ నవనీత్ కౌర్‌పై మరో కేసు నమోదయ్యింది. 2013లో అక్బరుద్దీన్ ఓవైసీ ఓ సభలో మాట్లాడుతూ... పోలీసులు 15 నిమిషాలు పక్కకి తప్పుకుంటే హిందువులను లేకుండా చేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి స్పందిస్తూ నవనీత్‌కౌర్ ఇటీవల ఓవైసీ సోదరులనుద్దేశించి వాళ్లకు 15 నిమిషాలు కావాలేమో తమకు కేవలం 15సెకన్లు చాలంటూ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించారు. దీంతో యాకుత్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్ ఫ్లయింగ్ స్కాడ్ టీమ్ ఇంచార్జి రాకేష్ సైదాబాద్ పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఎఫ్‌ఐఆర్ నంబరు 206 /2024, ఐపీసీ సెక్షన్లు 505(2) ,506,171 కింద ఆమెపై కేసు నమోదు చేశారు. కాగా, ఇటీవల నవనీత్‌కౌర్‌పై షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.