calender_icon.png 11 January, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌పై మరో కేసు..

11-01-2025 12:07:35 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 10 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్‌పై మరో కేసు నమోదైంది. శుక్రవారం ఏసీబీ విచారణకు వెళ్లిన ఆయన, విచారణ అనంతరం ఏసీబీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా తెలంగాణ భవన్‌కు వెళ్లారు.

అనుమతి లేకుండా ర్యాలీ తీశారని బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్‌ఐ గోవర్ధన్ ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేటీఆర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, బీఆర్‌ఎస్ పార్టీ నేతలు మన్నే క్రిశాంక్, గోవర్ధన్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా పలువురిపై పోలీసులు నమోదు చేశారు.

ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే ఛాన్స్ ఉన్నందున పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీంతో అక్కడి నుంచి కేటీఆర్, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తెలంగాణ భవన్‌కు వెళ్లారు.