హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పై శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. నిన్న కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదుతో కేటీఆర్ పై కేసు ఫైల్ చేశారు. నిన్న ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్(Telangana Bhavan) కు అనుమతి లేకుండా ర్యాలీగా వెళ్లారని పోలీసులు ఫిర్యాదులో పేర్కోన్నారు.