రూ.10 వేలకే 5జీ ఫోన్
ముంబై: పముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తన రెడ్‌మీ 14సీ 5జీ ఫోన్-ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రెడ్‌మీ14సీ 5జీ ఫోన్ గ్లాస్ బ్యాక్ తోపాటు మూడు రంగుల ఆప్షన్లతో వస్తోంది. 6.88-అంగుళాల డిస్ ప్లే విత్ 120హెర్జ్ రీఫ్రెష్ రేట్ తో వస్తోంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్, 5,160 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.
50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8- మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. రెడ్‌మీ14సీ 5జీ (Redmi 14C 5G) ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,999, 4జీబీ ర్యామ్ విత్ 128జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.10,999, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.11,999లకు లభిస్తుంది.
స్టార్ లైట్ బ్లూ, స్టార్ డస్ట్ పర్పుల్, స్టార్ గేజ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఎంఐ.కాం, షియోమీ రిటైల్ స్టోర్ల నుంచిరెడ్‌మీ14సీ 5జీ ఫోన్ విక్రయిస్తారు. రెడ్‌మీ14సీ 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14బేస్డ్ హైపర్ ఓఎస్ స్కిన్ వర్షన్‌పని చేస్తుంది. రెండేండ్ల పాటు ఆండ్రాయిడ్ అప్ డేట్స్, నాలుగేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందించనున్నది.
120 హెరట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.88 అంగుళాల హెచ్‌డీ+ పిక్సెల్స్ ఎల్సీడీ రిజొల్యూషన్ ఉంటుంది. ఫోన్ ర్యామ్ 12 జీబీ వరకూ వర్చువల్‌గా పెంచుకోవచ్చు. మైక్రో ఎస్డీకార్డ్ సాయంతో స్టోరేజీ కెపాసిటీ ఒక టిగా బైట్ వరకూ పొడిగించుకోవచ్చు. రూ.1,999 ధర గల 33వాట్ల ఇన్ బాక్స్ చార్జర్ కూడా అందిస్తారు. సింగిల్ చార్జింగ్‌తో స్టాండ్‌బై టైంగా 21 రోజులు, గరిష్టంగా 139 గంటలు మ్యూజిక్ ప్లే బ్యాక్ టైం బ్యాటరీ ఉంటుంది.