- నేడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో చేరనున్న ప్రకాశ్‌గౌడ్!
- ఆయనతో పాటు మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్‌లో గులాబీ పార్టీకి మరో షాక్ తగలనుంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ హస్తం పార్టీ లోకి చేరేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ప్రకాశ్‌గౌడ్ కాంగ్రెస్‌లోచేరనున్నారు. ఆయనతో పాటు అనుచరులు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరనున్నట్లు చెబుతున్నారు. ప్రకాశ్‌గౌడ్ గతంలోనే సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. అప్పుడే పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిసినట్లు, పార్టీ మారాలనే ఆలోచన లేదని ఖండించారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. ఇప్పుడు ప్రకాశ్‌గౌడ్ చేరితే ఆ సంఖ్య ఎనిమిదికి చేరుతుంది. అంతేకాకుండా నగరానికి చెందిన మరికొందరు కాంగ్రెస్ గూటికి వస్తారని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి.