calender_icon.png 19 April, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో మృతదేహం దొరికే అవకాశం!

27-03-2025 12:04:15 AM

  • ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో పెరుగుతున్న దుర్వాసన 
  • సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం

నాగర్‌కర్నూల్, మార్చి 26 (విజయక్రాంతి): శ్రీశైలం ఎడమ గట్టు సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో కార్మికులు చిక్కుకొని సుమారు 33 రోజులు గడుస్తోం  కాగా 16వ రోజు గురుప్రీత్ సింగ్ మతదే  బయటపడగా మంగళవారం ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్‌కుమార్ మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు బయటకు తీశాయి. అదే ప్రాంతంలో తవ్వకాలు మరింత వేగవంతం చేయడంతో మరో మృతదేహం లభ్యమ  ఆస్కారం ఉందని రెస్క్యూ బృందాలు చెపుతున్నాయి.

డేంజర్ జోన్ ప్రదేశంలో ఎస్కవేటర్‌ల సాయంతో మట్టి తవ్వకాలు వేగవంతం చేయడంతో ఆ ప్రాంతాల్లో దు  వెదజల్లుతోంది. దీంతో మృతదేహా  ఉన్నట్లుగా రెస్క్యూ బృందాలు అనుమానిస్తున్నాయి. అర్ధరాత్రికి లేదా గురువారం తెల్లవారుజాము వరకు మరో మృతదేహం బయటపడే ఆస్కారం ఉన్నట్లు ఆశాభవాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

ప్రస్తుతం డీ డీ ప్రదేశాల్లో కేరళకు చెందిన కడావర్ డాగ్ గుర్తించిన ప్రదేశాల్లో సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్ ఇతర రెస్క్యూ బృందాలు తవ్వకా  చేపట్టాయి. బుధవారం ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించిన  శివశంకర్ లోతేటి రెస్క్యూటిమ్ బృందాలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.