06-04-2025 12:58:45 AM
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్‌లో శనివారం 86 మంది మావోయిస్టులు లొంగిపో యారు. వీరిలో 66మంది పురుషులు, 20మంది మహిళలు ఉన్నారు.
అందరూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారే ఉన్నారు. ఈ సందర్భంగా మల్టీజోన్‌ేొ1 ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడారు. కాలం చెల్లిన మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని, వారికి ప్రభు త్వం తగిన పునరావస సౌకర్యం కల్పిస్తుందన్నా రు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి ఆకర్షితులై 86 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారని చెప్పారు.
వారికి తక్షణ సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.25వేలు అం దించామన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు భద్రా ద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో 224 మంది లొంగిపోయినట్లు తెలిపారు. సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజు, ములుగు ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, ప్రొఫెసనరీ ఐపీఎస్ పృథ్విక్ సాయి తదితరులు పాల్గొన్నారు.