calender_icon.png 15 January, 2025 | 3:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైక్ కొన్న కస్టమర్‌కు.. బహుమానంగా మరో బైక్

14-07-2024 05:57:04 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 13 (విజయక్రాంతి): హీరో కంపెనీ వ్యవస్థాపకు డు డా.బ్రీజ్ మోహన్‌లాల్ ముంజల్ శత జయంతి సందర్భంగా హీరో కంపెనీ ఆధ్వర్యంలో శనివారం ‘హోరో సెంటినియల్ సెలబ్రేషన్స్’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హీరో బైక్ కొనుగోలు చేసిన ప్రతీ కస్టమర్‌కు స్క్రాచ్ అండ్ విన్ ఆఫర్‌ను నిర్వహించారు. ఈ ఆఫర్‌లో వెంకటేశ్వరా హీరో షోరూం నుంచి బైక్ కొనుగోలు చేసిన గడ్డం లక్ష్మణ్ అనే కస్టమర్ సరికొత్త హీరో వాహనాన్ని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు షోరూం యజమానులు నల్ల మహిపాల్‌రెడ్డి, నల్ల జయరెడ్డి నూతన బైక్‌ను అందజేశారు.  కంపెనీ టీఎస్‌ఎం జగదీష్‌రెడ్డి, షోరూం సిబ్బంది కస్టమర్‌ను అభినందించారు.