calender_icon.png 9 January, 2025 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరోసారి దాడి జరిగితే తప్పదు భారీ మూల్యం

09-01-2025 12:51:17 AM

కల్వకుర్తి, జనవరి 8 : రాష్ర్టంలోని ప్రజ లు, పార్టీలు ప్రభుత్వాన్ని విమర్శిస్తే సద్వి మర్శగా తీసుకోవాలి కానీ పార్టీ ఆఫీసులపై  దాడులకు దిగడం ప్రజాస్వామ్య పద్ధతి కాద ని బిజేపి రాష్ర్ట కౌన్సిల్ మెంబర్ దుర్గా ప్రసాద్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ రాష్ర్ట కార్యాలయంపై  కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడాన్ని నిరసిస్తూ బుధవారం కల్వకుర్తి బిజెపి యువ మోర్చా ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలోని మహ బూబ్నగర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు.

కాంగ్రెస్ నాయకులు గుండాల్లా ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేస్తూ  భయబ్రాం తులకు గురిచేసారని, ఈ దాడిలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులపై క్రిమినల్ కేసు నమో దు చేయాలని, దీనికి పూర్తి బాధ్యత ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిదేనన్నారు. కాంగ్రెస్ అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రోజులలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బిజెపి, బిజెవైఎం నాయ కులు కార్యకర్తలు పాల్గొన్నారు.