calender_icon.png 15 October, 2024 | 5:53 AM

ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం!

15-10-2024 02:05:51 AM

న్యూయార్క్, అక్టోబర్ 14: అమెరికా ఆధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి హత్యాయతత్నానికి ప్రయత్నిచండం కలకలం రేపిం ది. ఇటీవల కాలిఫోర్నియాలోని కోచెల్లాలో ట్రంప్ ఎన్నికల ప్రచార సభకు సమీపంలో  ఓ వ్యక్తి రెండు గన్లతో సంచరిస్తున్నట్లు సీక్రెట్ సర్వీ స్ ఏజెంట్లు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు లాస్‌వెగాస్‌కు చెందిన మిల్లర్‌గా పోలీసులు గుర్తించారు. నకిలీ ప్రెస్‌కార్డుతో ర్యాలీ వేదిక వద్ద గన్లతో సంచరించాడు. దీనికి తోడు శనివారమే జైలు నుంచి బెయిల్‌పై విడుద లయ్యాడని, ర్యాలీ సమయంలో అతడు వినియోగించిన కారుకు రిజిస్ట్రేషన్ కూడా లేద ని, అందులో మందుగుండు సామగ్రి, తుపాకులు లభించాయని పోలీసులు వెల్లడించారు. కాగా పోలీసుల ఆరోపణలను మిల్లర్ కొట్టిపారేశాడు.