- జూలై తర్వాత మరోసారి దాడి
- ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా సమీపంలో కాల్పులు
- పారిపోతుండగా నిందితుడిని పట్టుకున్న భద్రతా సిబ్బంది
- ట్రంప్ సురక్షితంగా ఉన్నట్లు ప్రకటించిన అధికారులు
- ఘటనపై స్పందించిన బైడెన్, కమల
వాషింగ్టన్, సెప్టెంబర్ 16: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష్య అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై రెండోసారి హత్యాయత్నం జరిగింది. రెండు నెలల్లో ఆయనపై దాడి జరగడం ఇది రెండోసారి. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి కాల్పులకు యత్నించాడు. ప్రచారాన్ని ముగించుకుని వచ్చిన ట్రంప్.. ఫ్లోరిడాలోని తన వెస్ట్ పామ్ బీచ్ సమీపంలో గోల్ఫ్ కోర్సులో గోల్ఫ్ ఆడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటనలో ట్రంప్ క్షేమంగానే ఉన్నారని సీక్రెట్ సర్వీసెస్ విభాగంతో పాటు, మాజీ అధ్యక్షుడి సిబ్బంది సైతం వెల్లడించారు. కాల్పుల శబ్దం వినిపించగానే గోల్ఫ్ కోర్సును మూసేసి ట్రం ప్‌ను అక్కడి నుంచి వెంటెనే సురక్షిత ప్రాం తానికి తరలించినట్లు సీక్రెట్ సర్వీసెస్ తెలిపింది.
నిందితుడి అరెస్టు
ట్రంప్ లక్ష్యంగా, ఆయన్ను చంపే ఉద్దేశంతోనే ర్యాన్ ఏకే మోడల్ రైఫిల్‌తో వచ్చాడని ఎఫ్‌బీఐ పేర్కొంది. ట్రంప్‌కు సుమారు 500 అడుగుల దూరం నుంచే ర్యాన్ వెస్లీ ఆయుధంతో సిద్ధమయ్యే సమయంలో భద్రతాదళాలు కాల్పులు జరిపా యి. ఈ సమయంలో హంతకుడు కారులో పారిపోయే ప్రయత్నం చేయగా అధికారులు అరెస్టు చేసినట్లు ఎఫ్‌బీఐ తెలిపింది.
రెండు నెలల్లో రెండో అటాక్
ఈ ఏడాది జూలై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా థామస్ మాథ్యూ క్రూక్ అనే యువకుడు దగ్గరలోని ఓ గోడౌ న్ టాప్ నుంచి కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ట్రంప్ త్రుటిలో తప్పించుకున్నారు.
వాళ్లపై హత్యాయత్నాలు జరగడంలేదు: మస్క్
ట్రంప్‌పై దాడి గురించి స్పందిస్తూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పరోక్షంగా డెమోక్రాట్ నేతలపై అనుమానం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్‌ను హత్య చేసేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదం టూ సందేహం వ్యక్తం చేస్తున్న ఎమోజీ జత చేస్తూ ట్వీట్ చేశారు. ట్రంప్‌పైనే హత్యాయత్నాలు ఎందుకు జరుగుతున్నాయనే ఓ నెటిజన్ చేసిన పోస్ట్‌పై మస్క్ పరోక్షంగా డెమోక్రాట్ నేతలను ఉద్దేశించి ఈ విధంగా స్పందించారు.
దాడి ఎలా జరిగింది?
స్థానిక అధికారులు చెప్పిన ప్రకా రం.. ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్న సమయం లో 500 అడుగుల దూరంలో పొదల్లో నిందితుడు దాక్కున్నాడు. పొదల్లో నుం చి కాల్పులు జరిపాడు. అయితే, పొదల నుంచి తుపాకీ గొట్టాన్ని గుర్తించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆ ప్రదేశంపై విస్తృతంగా ఎదురుకాల్పులు జరిపారు. దీంతో నిందితుడు ఏకే సహా కొన్ని వస్తువులను అక్కడే వదిలి ఓ ఎస్‌యూవీలో పారిపోయేందుకు యత్నించాడు. ఈ లోపు ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి అధికారులు తరలించారు.
కారులో పారిపోయిన ట్రంప్‌పై హత్యాయత్నం చేసిన వ్యక్తిని ఛేజ్ చేసి మరీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని ర్యాన్ వెస్లీ రౌత్ గా గుర్తించారు. కొన్ని నెలల కింద ఉక్రెయిన్‌కు మద్దతుగా రష్యాపై యుద్ధానికి అతడు సాయం చేసుకున్నట్లు ప్రకటించినట్లు పోలీసులు గుర్తించారు. ర్యాన్ చేసిన దాడిలో ఎవరికీ గాయా లు కాలేదు. కానీ ట్రంప్‌ను హత్యచేసేందుకే ఆ వ్యక్తి వచ్చినట్లు ఎఫ్‌బీఐ పేర్కొం ది. ఈ ఘటనపై ట్రంప్ భద్రతను పర్యవేక్షించే సీక్రెట్ సర్వీసెస్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఎప్పటికీ లొంగిపోను..
ట్రంప్ తనపై జరిగిన దాడిపై స్పం దిస్తూ తన అభిమానులను ఉద్దేశించి మెయిల్ చేశారు. “నేను ఉన్న ప్రాంతానికి సమీపంలోనే కాల్పులు జరిగాయి. కానీ పరిస్థితులు అదుపులో లేవనే పుకా ర్లు అబద్ధం. నేను క్షేమంగా ఉన్నానని బలంగా చెబుతున్నా. ఏదీ నన్ను అడ్డుకోలేదు. నన్ను ఎవరూ ఆపలేరు. నేను ఎప్పటికీ, ఎవరికీ లొంగేదే లేదు” అని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్‌కు గోల్ఫ్ అంటే ఇష్టం. వీలు చిక్కినప్పుడు మధ్యాహ్న భోజన సమయానికి ముందు వెస్ట్ పామ్ బీచ్‌లోని తన గోల్ఫ్ కోర్టులో గడుపుతారు. అదే అలవాటులో భాగం గా ఆదివారం మధ్యాహ్నం గోల్ఫ్ కోర్సుకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. ట్రంప్ అధికారంలో లేరు కాబట్టి ఆయ న వెళ్లే అన్ని ప్రదేశాలకు పూర్తి స్థాయి భద్రత ఉండదని సీక్రెట్ సర్వీసెస్ తెలిపింది. ప్రెసిడెంట్ స్థాయి వ్యక్తికి ఇచ్చే భద్రత కల్పించి ఉంటే ఇలాంటి ఘటన లు చోటుచేసుకునేవి కావని పేర్కొంది.
రాజకీయ హింసకు చోటులేదు: బైడెన్, కమల
ట్రంప్ సురక్షితంగా ఉన్నారు. ఆయనపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు.ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. అమెరికాలో రాజకీయ హిం సకు ఎలాంటి చోటు లేదని పునరుద్ఘాటిస్తున్నా. ట్రంప్‌కు అన్ని విధాలా కట్టుది ట్టమైన భద్రత కల్పించాలని అధికారుల ను ఆదేశించాను. ఈ ఘటనపై డెమోక్రా ట్ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ట్రంప్ సురక్షితంగా ఉన్నారని తెలిసి సంతోషించినట్లు చెప్పారు. అమెరికాలో రాజకీయ హింసకు తావులేదని అన్నారు.