calender_icon.png 4 March, 2025 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనోరా..అహో!

04-03-2025 12:00:00 AM

ఆస్కార్ 2025 మెచ్చిన వేశ్య చిత్రం

అనోరా చిత్రంలో తన నటనకుగాను ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు అందుకున్న మైకీ మ్యాడిసన్ 

యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూసిన 97వ ఆస్కార్ అవార్డుల సంబరం కన్నుల పండువగా జరిగింది. అకాడమీ అవార్డుల వేడుకకు హాలీవుడ్ ముఖ్య తారాగణంతో పాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ వేడుకలో ‘అనోరా’ అనే చిత్రానికి అవార్డుల పంట పండింది.

ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో ‘అనోరా’ అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా ఆడ్రియన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్), ఉత్తమ నటిగా మైకీ మ్యాడిసన్ (అనోరా) అవార్డు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా సీన్ బేకర్ (అనోరా)కు అవార్డు దక్కింది. లాస్ ఏంజెలెస్ డాల్బీ థియే టర్‌లో ఈ వేడుక జరిగింది. నటీమణులంతా ట్రెండీ దుస్తు ల్లో వేడుకకు హాజరై ఆకట్టుకున్నారు. 

విజేతల వివరాలు

ఉత్తమ చిత్రం: అనోరా
ఉత్తమ నటుడు: ఆడ్రియన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్)
ఉత్తమ నటి: మైకీ మ్యాడిసన్ (అనోరా)
ఉత్తమ దర్శకత్వం: అనోరా (సీన్ బేకర్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: కీరన్ కైల్ కల్కిన్ (ది రియల్ పెయిన్)
ఉత్తమ సహాయ నటి: జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే: అనోరా (సీన్ బేకర్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: కాన్‌క్లేవ్ (పీటర్ స్ట్రాగన్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: వికెడ్ (పాల్ తేజ్‌వెల్)
ఉత్తమ మేకప్, హెయిర్ స్టుల్: ది సబ్‌స్టాన్స్
ఉత్తమ ఎడిటింగ్: అనోరా (సీన్ బేకర్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ది బ్రూటలిస్ట్ (లాల్ క్రాలే)
ఉత్తమ సౌండ్: డ్యూన్: పార్ట్ 2
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: డ్యూన్: పార్ట్ 2

బెస్ట్ ఒరిజినల్ సాంగ్: ఎల్ మాల్ (ఎమిలియా పెరెజ్)
ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: ఐయామ్ స్టిల్ హియర్ (వాల్టర్ సాల్లెస్ బ్రెజిల్)
బెస్ట్ ఒరిజినల్ స్కోర్: ది బ్రూటలిస్ట్ (డానియల్ బ్లమ్‌బెర్గ్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: వికెడ్
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం: ఐయామ్ నాట్ ఏ రోబో
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం: ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం: నో అదర్ ల్యాండ్
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం: ఫ్లో
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం: ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రస్