అర్మూర్, ఫిబ్రవరి 2 (విజయ క్రాంతి) : ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో చేపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మేడిపల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామంలోని దేవతలకు గంగ జలాలతో అభిషేకాలు చేశారు.
మాఘ మాసం మొదటి ఆదివారం సందర్భంగా పోచంపాఢ్ గోదావరి నది నుండి గంగా జలాలను తీసుకుని వచ్చి చేపూర్ గ్రామ శివారు నుండి గంగా జలాలను దప్పు వాయిద్యాలతో మంగళ హారతులతో ఊరేగింపుగా గ్రామంలో ఉన్న అన్ని గుడిలలో గల విగ్రహాలకు జలాభిషేకం నిర్వహించడం జరిగింది.
గంగ జలాల అభిషేకాల అనంతరం మహిళలు గ్రామ దేవతలకు నైవేద్యం మరియు కల్లు శాఖ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు కుస్తాపురం నడిపెన్న, కోశాధికారి రుక్మిణి, ముఖ్య సలహాదారుడు బొబ్బిలి బొర్రన్న, మెదరి నరేష్, శెట్టి మనోహర్, బట్టు కోళ్ల సాయన్న, రైటర్ కంపదండి వినోద్, మాల సంఘం సభ్యుడు రాజన్న గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.