15-04-2025 06:51:29 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదించి జీవో విడుదల చేసిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో శ్రీ జాంబవ దళిత వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ కత్తి స్వామి తదితరులు పాల్గొన్నారు.