calender_icon.png 23 February, 2025 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన ఆర్డ్ రిజర్వు వార్షిక మొబిలైజేషన్

21-02-2025 12:39:49 AM

కరీంనగర్ క్రైమ్, ఫిబ్రవరి 20: ప్రతి సంవత్సరం ఆర్మ్డ్ రిజర్వు పోలీసులకు శిక్షణలో భాగంగా నిర్వహించే వార్షిక మొబిలై జేషన్ కార్యక్రమం గురువారం ముగిసింది.  డిమొబిలెజైషన్ కార్యక్రమ పరేడ్‌ను కరీంనగర్ పోలీసు కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించారు.  సాయుధ బలగాల పోలీసులు ఈ పరేడ్ లో పాల్గొన్నారు. 

 ఈ సందర్బంగా అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ శాంతి భద్రతల సమ స్యలు తలెత్తినపుడు వాటిని అదుపు చేయుటకు ముఖ్యంగా ఆర్మ్డ్ రిజర్వు పోలీసుల సేవలు వినియోగించుకుంటామన్నారు. ఈ మొబిలైసెషన్ లో భాగంగా   సాయుధ బలగాల పోలీసులకు,  విధులకు సంబందించిన ఆర్మ్ డ్రిల్, వెపన్ డ్రిల్, పరేడ్, మాబ్ ఆపరేషన్, వెపన్ ఫైరింగ్  మొదలగు అన్నీ అంశా ల్లో  20 రోజుల పాటు శిక్షణ అందించామన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను వి ధుల్లో కనబరుస్తూ మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజర్వు ఇన్స్పెక్టర్లు రజనీకాంత్ , జానీమియా , శ్రీధర్ రెడ్డి , సురేష్ అధికారులు పాల్గొన్నారు.