22-04-2025 07:28:52 PM
చిట్యాల (విజయక్రాంతి): మండల కేంద్రంలోని కాకతీయ హైస్కూల్లో అన్యువల్ డే సెలబ్రేషన్స్ మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రాజ్ మహమ్మద్ విద్యార్థులకు రిజల్ట్ డే ప్రోగ్రెస్ ఫైల్, మెమొంటోలను అందజేశారు. అలాగే పాఠశాల 35 సంవత్సరాల వార్షికోత్సవంలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులకు మెమొంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం కరస్పాండెంట్ మహమ్మద్ రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ... 35 సంవత్సరాల కాలంలో పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. మూడో తరగతి నుండి ఐఐటి క్లాసులను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సైతం మంచి విద్యను అందిస్తామని తెలిపారు.