21-03-2025 01:57:55 AM
సందడి చేసిన సినీతారలు విజయ్ దేవరకొండ, నితిన్
హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): సురారంలోని మల్లారెడ్డి క్రికెట్ గ్రౌండ్‌లో గురువారం మల్లారెడ్డి యూనివర్సిటీ వార్షిక వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు యూనివర్సిటీ వ్యవస్థాపకులు సీహెచ్ మల్లారెడ్డి, చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి, మల్లారెడ్డి వర్సిటీ వైస్‌చైర్‌పర్సన్ డాక్టర్ సీహెచ్ ప్రీతి రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
సినీతారలు విజయ్ దేవరకొండ, నితిన్ తదితరులు సందడి చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఎప్పుడు పాలమ్మిన.. పూలు అమ్మిన అని చెప్పే మల్లారెడ్డి గారు .. దేశం గర్వించదగ్గ మూడు విశ్వవిద్యాలయాలు నెలకొల్పారని కొనియాడారు.
కానీ ఆయనకు సంపద కంటే, విద్యార్థుల ప్రేమ ఎంతో ముఖ్యమైందన్నారు. ఈ వార్షిక వేడుకలకు రావడం వల్ల తనకు తన కాలేజీ రోజులు గుర్తొచ్చాయని తెలిపారు. ఈ వేడుకలో డాక్టర్ సీహెచ్ ప్రీతి రెడ్డి అద్భుతమైన నృత్యంతో అలరించారు.