25-02-2025 01:04:07 AM
వేడుకగా స్వామివారి తిరు కల్యాణ మహోత్సవం
యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి 24 (విజయ క్రాంతి): స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదవ రోజైన సోమవారం నాడు సాయంత్రం తిరు కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా వందలాదిమంది భక్త జనుల మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి వారి చేతుల మీదుగా అత్యంత వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి తిరు కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
అనంతరం శ్రీవారు తిరుచ్చి వాహనం మీద కొలువుదీరి ఆలయ తిరు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యారాద నలు పూర్తి చేశారు. అనంతరం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీమాన్ మానేపల్లి రామారావు ద్వారా తోరణా పూజ నిర్వహించి యాగశాల ప్రవేశం చేశారు.
ఆలయంలోని చతుస్థానార్చన మూర్తి కుంభ హోమములు నిర్వహించారు. ఇస్తి యాగశాలలో సకల శత్రు బాధలు రోగ నివారణకు సకల కార్య జయము ను కాంక్షిస్తూ సుదర్శన ఇస్తి హోమమును నిర్వహించారు. స్వామివారి కార్యక్రమాలను వందలా దిమంది భక్తులు కనులారా వీక్షించి తన్మయం చెందారు.