calender_icon.png 28 February, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

28-02-2025 01:20:11 AM

7న ఎదుర్కోలు, 8న కల్యాణం 9న రథోత్సవం 11న చక్రస్నానం

యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి 27 ( విజయ క్రాంతి ): యాదగిరిగుట్ట శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి ఒకటో తేదీ నుండి 11వ తేదీ వరకు అత్యంత వైభవంగా, కనుల పండుగగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి భాస్కరరావు తెలిపారు. గురువారం నాడు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1వ తేదీ నుండి 6 వ తేదీ వరకు స్వామివారికి అంకురార్పణ వైదిక సేవలు నిర్వహిస్తామని 7 వ తేదీన ఎదుర్కోళ్ల మహోత్సవం, 8న తిరు కళ్యాణ దివ్య విమాన మహోత్సవం. 9న రథోత్సవం, 11న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగింపు జరుగుతాయని వెల్లడించారు.

బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి మంత్రులు, ప్రముఖుల అందరిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 3 కోట్ల 5 లక్షల రూపాయలతో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గత సంవత్సరం పెట్టిన ఖర్చు మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అంతే ఖర్చుతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యాగశాల బయట విశాల స్థలంలో వేశామని అందులో ప్రతిరోజు హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రతిరోజు 2000 మందికి అన్నప్రసాద వితరణ చేయాలని నిర్ణయించమన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించమన్నారు. ప్రముఖ ప్రవచన కర్త, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు ఆధ్వర్యంలో ప్రవచన కార్యక్రమాలతో పాటు, ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రం నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తుల అధిక సంఖ్యలో రానున్నారని వారందరికీ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. భక్తులకు ఇటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో తెలిపారు. స్థానికులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.