ప్రధానమైన కొన్ని దినాలను ప్రభుత్వం గుర్తించవలసిన అవసరం ఉంది. ఈ మేరకు కొన్ని ముఖ్యమైన రోజులకు సెలవులు ప్రకటించాలి. బాగా ప్రాముఖ్యం వున్న రోజులు, అవి ఎవరికి సంబంధించినవి అయినా సరే వాటి ప్రాధాన్యాన్ని బట్టి గుర్తించి, తప్పక సెలవు ఇవ్వాలి. ఈ మధ్య కాలంలో కొన్ని ప్రత్యేక రోజులను గుర్తిస్తూ ప్రభుత్వం అప్పటికప్పుడు సెలవులు ప్రకటిస్తూ వున్నది. కానీ, అది ఆచరణలో పూర్తి స్థాయిలో అమలులోకి రావడం లేదు. కనుక, సంవత్సరానికి సంబంధించి సెలవులు నిర్ణయించే సమయంలోనే దీనిని పరిగణనలోకి తీసుకోవాలి. దీనివల్ల సంబంధిత ప్రజలు హర్షిస్తారు.
షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్